telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ?

star maa promo on bigg boss 3

క‌రోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్ర‌ణ‌లో భాగంగా ప్ర‌భుత్వం రెండు నెల‌ల‌పాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో షాపులు, మాల్స్‌, థియేట‌ర్స్, ర‌వాణా వ్య‌వ‌స్థ‌, షూటింగ్స్ ఇలా అన్నింటికి బ్రేక్ పడింది. క‌రోనా వైర‌స్ ప్రభావం సినిమాపై గట్టిగానే పడింది. గ‌త రెండు నెల‌లుగా ఎంటర్‌టైన్‌మైంట్ రంగానికి సంబంధించిన అన్ని ప‌నులు ఎక్క‌డిక్క‌డ ఆగిపోయాయి. జూలై లేదా ఆగ‌స్ట్ నుండి ఈ ప‌నులు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. అయితే క‌రోనా వ‌ల‌న బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఈ ఏడాది ఉండ‌క‌పోవ‌చ్చ‌నే టాక్ ఇంతకుముందు విన్పించింది. అయితే తాజాగా స్టార్ మా ఈ షోకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 4 ప్రతి ఏడాది జూలై మొద‌టి వారంలో ప్రారంభం కానుండ‌గా, ఈ ఏడాది కూడా అదే టైంకి ప్రారంభించాల‌ని స్టార్ మా చాలా కాన్ఫిడెంట్‌గా ఉంద‌ట‌. ఇక ఇందులో కంటెస్టెంట్స్‌గా త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్ త‌దిత‌రులు ఉంటార‌ని తెలుస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోలోనే సీజ‌న్ 4 కూడా జ‌ర‌గ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి హోస్ట్ ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

Related posts