వార్తలు సామాజిక సినిమా వార్తలు

తెలుగు భాష (వెన్నెలమ్మ పదాలు)

nene poetry corner

తెలుగు భాష పొందిక
తెలుగు భాష మన్నిక
తెలుగు భాష ఏలిక
ఓ వెన్నెలమ్మ !
   తెలుగే రాచబాట
   తెలుగే తీపి పాట
   తెలుగే వెలుగు మూట
   ఓ వెన్నెలమ్మ !
తెలుగు తీయని ఊట
తెలుగు పరిమళ తోట
తెలుగు సుందర కోట
ఓ వెన్నలమ్మ !
   అనురాగాల పేట
   అమూల్యమైన మాట
   తెలుగు గౌరవ పీట
   ఓ వెన్నెలమ్మ !
తెలుగు నడవని చోట
తెలుగు నుడవని నోట
ఉండొద్దు ఆ చోట
ఓ వెన్నెలమ్మ !
    తెలుగంటే తల్లిరా !
    అనురాగ మల్లెరా
    అపురూప పల్లెరా
    ఓ వెన్నెలమ్మ !

-గద్వాల సోమన్న, టీచర్

Related posts

రజనీ అందుకే హిమాలయాలకు వెళ్లారట !

admin

బీజేపీ ఉపవాస దీక్షలు… ఉద్రిక్తతలు

admin

త్వరలో ఇండియాలోకి ఉబర్ ఎయిర్ ట్యాక్సీలు

jithu j

Leave a Comment