telugu navyamedia
news political Telangana trending VOTE

తెలంగాణాలో… డిపాసిట్లు కోల్పోయినవారు…

telangana worst loosers

తెలంగాణా ఎన్నికల ఫలితాలు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ ఫలితాలలో తెరాస ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం 119 స్థానాలలో 1821 మంది అభ్యర్థులు పోటీకి దిగగా, అందులో 1515 మందికి డిపాసిట్లు కూడా దక్కకపోవడం విశేషం. జాతీయ పార్టీ, బీజేపీ కూడా 30 స్థానాలకుపైగా డిపాసిట్లు కోల్పోవడం జరిగింది.

ఇక ప్రజా కూటమిలో కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఘోరంగా స్థానాలు గెలవడం జరిగింది. టీడీపీ పరిస్థితి కూడా అంతే. గత ఎన్నికలలో కాంగ్రెస్ 25 సీట్లు పైగా గెలవగా ఈ సారి 20 లోపే సరిపుట్టుకోవడం, టీడీపీ గతంలో 15 స్థానాలలో విజయం సాధించగా ఈ సారి 2 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఇక కోదండరాం పార్టీ టీజేఎస్ కూడా ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఈ పార్టీలన్నీ దాదాపు అన్ని స్థానాలలో డిపాసిట్లు కోల్పోవడం జరిగింది. భారీ విజయం సొంతం చేసుకున్న తెరాస కు కూడా నాలుగు స్థానాలలో డిపాసిట్లు గల్లంతవడం కొసమెరుపు. డిపాసిట్లు కోల్పోయిన వారిలో బాబూమోహన్, ఎన్వీ ఎస్.ఎస్ ప్రభాకర్, సిపిఐ అభ్యర్థి మల్లేష్ లు ఉన్నారు.

Related posts

క్యారెట్ తో.. డయాబెటిస్ కు చెక్.. ఇలా.. !

vimala p

డేటాచోరీ కేసుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు! 

ashok

పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా .. రజనీకాంత్ .. వచ్చే ఏడాది పోస్టింగ్.. !

vimala p