telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాకౌట్ దిశగా .. తెలంగాణ విద్యుత్ సంస్థలు.. భారీగా బిల్లులు పెండింగ్..

telangana transco into lockout soon

మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోళ్లు జరిపింది. ఛత్తీస్ గఢ్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. దీంతో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు కష్టాలను అధిగమించింది, 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. సింగరేణి తదితర ప్లాంట్ ల విద్యుత్ కూడా తోడవడంతో అవసరానికి మించి కరెంట్ అందుబాటులోకి వచ్చింది. మితిమీరిన విద్యుత్ కొనుగోళ్లు ప్రభుత్వానికి భారంగా మారింది.

కరెంట్ కొంటున్న ట్రాన్స్ కో ఉత్పత్తి చేస్తున్న జెన్ కోలు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యుత్ తో పాటు బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.10,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మిగిలిన ప్రైవేట్ రంగంలోని విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో నుంచి బకాయిల వసూలు అవ్వక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన విద్యుత్ ప్లాంట్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి ట్రాన్స్ కో బిల్లులు చెల్లించడం లేదనే నెపంతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నెల రోజులుగా కార్మికుల వేతనాలను నిలిపివేసింది. నవంబర్ 7వ తేదీన లాకౌట్ నోటీసిచ్చి ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. సంవత్సర కాలంగా టీఎస్ ట్రాన్స్ కో నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. కొద్దినెలలపాటు కార్మికుల వేతనాలు సర్దుబాటు చేసినప్పటికీ ఇక మీదట భరించే స్థితిలో లేనందున తమ ప్లాంట్ ను లాకౌట్ చేస్తున్నట్టుగా శాలివాహన విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది.

Related posts