telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సెల్‌ఫోన్‌ ఆప్‌ ద్వారా దేవాలయాల సేవలు

motorola 1 vision on 15th in

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఇక నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీ ఆప్ ఫోలియో ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఆప్ నుంచే భద్రాచలం శ్రీ సీతారామచంద్రమూర్తి సేవలు, అక్కడి గదులు బుక్ చేసుకోవచ్చు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలు, గదులు ఈ ఆప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం సేవలు, విరాళాలు ఆప్ ద్వారా చెల్లించవచ్చు. ఉమ్మడి ఆధిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం సేవలు, గదులను ఆన్‌లైన్‌లో ఈ ఆప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Related posts