telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపటి నుండి 6,7, 8 తరగతులు ప్రారంభం…సీఎం కేసీఆర్‌కు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కృతజ్ఞతలు

ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుండి 9 మరియు 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు తరగతులు ప్రారంభమైన నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు మరియు ఇతర మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరికీ ఇతర తరగతులు ప్రారంభంపై వరుసగా సమర్పించిన వినతి పత్రాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి వెంటనే 6 నుండి 8 తరగతులు కూడా పాఠశాలల పున:ప్రారంభానికి అనుమతించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారికి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ గారికి కృతజ్ఞతాసుమాంజలులు తెలియజేస్తున్నట్లు యాదగిరి శేఖర్ రావు తెలియజేశారు. ట్రస్మా రాష్ట్ర సంఘం తరఫున పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుకూలంగా విని తగు విధంగా స్పందించి పాఠశాలల సమస్యలను, విద్యార్థిని విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలను సహృదయంతో అర్థం చేసుకొని మా వినతి పత్రాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్లి 6 నుండి 8 తరగతుల పాఠశాలల ప్రారంభమయ్యేటట్లుగా అనుమతులు ఇప్పించిన మంత్రులు కేటీఆర్ గారు ,హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారికి, ఎమ్మెల్సీలు కవిత గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గార్లకు తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల తరపున ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నట్లు యాదగిరి శేఖర్ రావు అన్నారు.
విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి చిత్రా రామచంద్రన్ గారికి మరియు కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీమతి దేవసేన గారికి ఈ సందర్భంగా trsma తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ట్రస్మా కార్యదర్శి మధుసూదన్ గారు మరియు కోశాధికారి రమణారావు గారు తెలియజేశారు. తెలంగాణలోని అన్ని ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మిత్రులందరూ ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించే విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కూడా అత్యున్నత ప్రాధాన్యతను ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురుకాకుండా పాఠశాల రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన విద్యా సంస్థ యాజమాన్యాలకు విన్నవించారు. ముఖ్యంగా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి, అధికారుల,నాయకుల దృష్టికి మరియు సంబంధిత మంత్రుల, శాఖల దృష్టికి తీసుకువస్తూ సమాజంలో ఒక స్పూర్తి కలిగించిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత వందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రాష్ట్ర కోశాధికారి ఐ వి రమణ రావు మరియు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts