telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ‌లో రేప‌టినుంచే స్కూల్స్ రీఓపెన్‌

*తెలంగాణ‌లో రేప‌టినుంచి స్కూల్స్ రీఓపెన్‌
*సెల‌వులు పొడిగింపు లేద‌ని విద్యాశాఖ వెల్ల‌డి..
*1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియలో బోధన

తెలంగాణ‌లో రేపటి స్కూళ్లు ప్రారంభంకానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్కూళ్లకు సెలవుల పొడగింపు ప్రసక్తే లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు రేపు స్కూళ్లకు హాజరు కావాలని విద్యాశాఖ. తెలిపింది.

ఈ మేరకు మంత్రి సబితా రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సెలవులు పొడిగింపు ఉండదని మరో మారు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను సోమవారం నుంచి వేసవి సెలవుల అనంతరం తిరిగి తెరుకుకుంటాయని మంత్రి చెప్పారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అలాగే..రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలను మంత్రి సబిత కౌంటర్ వేశారు. ‘మన ఊరు – మన బడి’కి కేంద్రం రూ కేంద్రం ఇచ్చిందంటున్న రూ.2,700 కోట్లు ఎక్కడ ఇచ్చారో నిరూపించాలని సవాల్ విసిరారు. ఒకవేళ కేంద్రం ఇచ్చి ఉంటే.. ఎక్కడి నుంచి డ్రా చేసుకోవాలో చెప్పాలని ఎద్దేవా చేశారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని.. బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు.

బండి సంజయ్ ఓ వైపు టెట్‌ పరీక్ష వాయిదా వేయాలంటారని.. మరోవైపు 20 వేల ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలంటారని మంత్రి ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి భాజపా నేతలు ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకువచ్చి మాట్లాడితే.. బాగుంటుందన్నారు.

Related posts