telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏప్రిల్ 10 న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు బస్సులు డౌటే..?

Tsrtc Special Buses for Sankranti

హైదరాబాద్‌తో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్థిరపడ్డ సుమారు 50 లక్షల మంది ఆంధ్రులు ఓట్ల పండుగ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 11న ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లే సీమాంధ్రులకు సీఎం కేసీఆర్ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు వెలువడుతున్నాయి. రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో ఏప్రిల్ 10న సీట్లన్ని ఫుల్ అయిపోయాయి. తెలంగాణ నుంచి ఏపీకి ప్రతి రోజు 25 శాతం వరకు టికెట్లు రిజర్వ్ అవుతుంటాయి. కానీ పోలింగ్‌కు ముందు రోజు దాదాపు 70 శాతం మేర సీట్లు రిజర్వ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు.

అయితే ఏపీ ఓటర్లు తమ సొంత రాష్ట్రానికి వెళ్లి ఓటు వేయకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న తెలంగాణ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసే అవకాశముందని చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ఉన్నందున దూరప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని బస్సుల్లో తరలిస్తారు. దీంతో తగినన్ని బస్సులు ఆరోజు అందుబాటులో లేకపోవడంతో ఏపీకి ఆర్టీసీ బస్సులను రద్దు చేస్తున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవమెంతో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాలి మరి.

Related posts