telugu navyamedia
news political Telangana trending

పంచాయతీలో… మహిళలకు 50 శాతం రిజర్వేషన్…

telangana reservations for panchayat

తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలలో ఎన్నికల శోభ వచ్చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్ లను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ లకు 2,113; షెడ్యూల్ ఏరియా లో వారికీ 1,281; వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు 1,177; మిగిలిన గ్రామపంచాయితీలలో ఎస్టీ లకు 688; బీసీలకు 2,345; జనరల్ వారికి 5,147 గా నిర్ణయించారు.

ఈ రిజర్వేషన్ ల అన్నిటిలో మహిళలకు 50శాతం కేటాయించడం విశేషం. వందశాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయితీల అన్నిటినీ ఎస్టీ రిజర్వుడ్ గా పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ముందుగా చెప్పినట్టుగా మూడు దశలలో జరగనున్నాయి. ప్రతి దశకు నాలుగు రోజుల విడిదితో ఈ మూడు దశల పంచాయత్ ఎన్నికలు జరుగుతాయి.

Related posts

యాదారిగి గుట్టలో .. ఆర్టీసీ బస్ స్టేషన్ .. 14 ఎకరాలు కేటాయింపు..

vimala p

మంత్రోచ్చారణల మధ్య మహా చండీయాగం!

ashok

చిరునవ్వుల పువ్వులు…

vimala p