తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు

High court gives green signal, Group 2

తెలంగాణ పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు ఈ రోజు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మూడు నెలల లోపు అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పంచాయితీల్లో ప్రత్యేక అధికారులను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడింది.

ఈ మూడు నెలల లోపు ప్రత్యేక అధికారుల సేవలను కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే అప్పటిలోగా ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్నిఆదేశించింది. తెలంగాణలో పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించడాన్ని సవాలు చేస్తూ వెంకటేశ్ అనే న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది.

Related posts

మోహన్ బాబు తన తల్లిని గుర్తు చేసుకొని.. అమ్మ ప్రేమ గొప్పదనాన్ని చాటి చెబుతూ

nagaraj chanti

కోమటిరెడ్డి, సంపత్ ల కేసు తీర్పు …

admin

హైందవ సనాతన సంస్కృతి…

chandra sekkhar

Leave a Comment