telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

MLC nominations file date end today

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, 30న మూడో విడత పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది.  సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా బ్యాలెట్‌ పేపర్లు తెలుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి.  పోలింగ్‌ రోజే ఓట్ల లెక్కింపు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తారు.

పోలింగ్‌ కేంద్రాల ఏర్పాట్లతో పాటు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి ప్రిసైడింగ్‌ అధికారులు సిబ్బందిని గుర్తించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్‌ అధికారులు, అదనపు పోలింగ్‌ ఆఫీసర్లను నియమించనున్నారు. .

సర్పంచ్‌లుగా పోటీ చేసిన అభ్యర్థులు (జనరల్‌) రూ.2000, రిజర్వుడు కేటగిరీ రూ.1000, వార్డు మెంబర్‌ (జనరల్‌) రూ.500, రిజర్వుడు రూ.250 చొప్పున ధరావతుగా చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదు. 5వేలకంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలైతే అభ్యర్థుల ఖర్చును రూ.1,50,000గా నిర్ణయించారు.  ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తు ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు.

Related posts