telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే…

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 60కి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఇక మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు.

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బరిలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థులు

1.వాణిదేవి – టిఆర్ఎస్.
2.చిన్నారెడ్డి – కాంగ్రెస్
3.రామచంద్రరావు – బీజేపీ
4.ఎల్. రమణ – టీడీపీ
5. ప్రొ. నాగేశ్వరరావు – వామపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థి.
6. హర్షవర్ధన్ రెడ్డి – కాంగ్రెస్ రెబల్.
7. కపిలవాయి దిలీప్ కుమార్ – టిఆర్ఎల్డి

ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి బరిలో ఉన్న ముఖ్యమైన అభ్యర్థులు

1. పల్లా రాజేశ్వర్ రెడ్డి – టిఆర్ఎస్
2. సభావత్ రాములు నాయక్ – కాంగ్రెస్
3. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి – బీజేపీ
4. జయసారధి రెడ్డి – సీపీఐ, సిపిఎం
5. కోదండరామ్ – జనసమితి.
6. రాణి రుద్రమదేవి – యువ తెలంగాణ పార్టీ
7. తీన్మార్ మల్లన్న – ఇండిపెండెంట్
8. చెరుకు సుధాకర్ – తెలంగాణ ఇంటి పార్టీ
9. షబ్బీర్ అలీ – ఇండిపెండెంట్

Related posts