telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

తెలంగాణలో లాక్‌డౌన్‌.. పెరిగిన కూరగాయల ధరలు

Marketa rythu bazar Hyd

తెలంగాణలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో కూరగాయల ధరలను పెంచి వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. మార్కెట్ లలో కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్‌ల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. టమాటా కిలో ధరనిన్నటి వరకు రూ. 8గా ఉంది. ఈ రోజు వ్యాపారులు కిలో రూ.100కి అమ్ముతున్నారు.

వంకాయ నిన్నటి వరకు కిలో రూ.15 ఉండగా ఈ రోజు రూ. 80కి, మిర్చి కిలో రూ. 25గా ఉండగా ప్రస్తుతం రూ. 90కి అమ్ముతున్నారు. అలాగే, అన్ని కూరగాయల ధరలు పెంచేశారు. హైదరాబాద్‌లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్‌ జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వ్యాపారులు మాత్రం ఇష్టానుసారంగా కూరగాయల ధరలను పెంచేశారు.

Related posts