telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్ సమావేశం గురువారం ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించి, సమస్యకు ముగింపు పలికేదిశగా రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం అయింది.

ఈ మంత్రివర్గ సమావేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ, రవాణా పరిస్థితులు, అక్కడ అమలవుతున్న విధానాలపై కూడా ఈ చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేదిశగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Related posts