telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావా?: అశ్వత్థామరెడ్డి

ashwathama reddy

తెలంగాణలో స్ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సీఎం పీఠం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని కేసీఆర్ గుర్తెరగాలని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కంటే కేసీఆర్ గొప్ప మేధావి కాదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె బాట నేపథ్యంలో తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆయన అన్నారు.

కొందరు మంత్రులు ఆర్టీసీ కార్మికులపై విమర్శలు చేసి, ఆపై ఇంటికి వెళ్లి రోదిస్తున్నారని అశ్వత్థామరెడ్డి వివరించారు. ఆర్టీసీ సమ్మెపై మేధావులు మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకుంటే మాత్రం 1994 సంక్షోభం పునరావృతమవుతుందని, కేసీఆర్ ఆ విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ఈటల తదితర మంత్రులు ఇప్పటికైనా ఆర్టీసీ సమ్మెపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

Related posts