telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

ఎల్లుడి నుంచే కాలేజీలు ప్రారంభం.. కీలక సూచనలు ఇవే !

ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో కళాశాలు, పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఏడాది పాటు విద్యాసంస్థలు మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే.. తాజాగా కరోనా నిబంధనలు పాటిస్తూ… విద్యాసంస్థలు రీ-ఓపెన్‌ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ కీలక సూచనలు చేశారు. కళాశాలకు విద్యార్థులు మాస్క్ తప్పని సరిగా ధరించి రావాలని.. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు బోర్డ్ జారీ చేసిన మార్గ దర్శకాలు పాటించాలని తెలిపారు. ప్రతి రోజు తరగతి గదుల సానిటైజేషన్ ఉంటుందని… విద్యార్థులు కళాశాలలకు రావాలి అంటే తల్లి తండ్రుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రతి కళాశాలను స్థానిక Phc కేంద్రంతో అనుసంధానం చేశామని.. ఒక రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మరో రోజు సెకండ్ ఇయర్ క్లాసెస్ ఉంటాయన్నారు. పరీక్షల విధానంలో తేడా లేదని.. 70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు… ప్రశ్నల్లో ఛాయిస్ ను పెంచుతామని పేర్కొన్నారు. ఎంసెట్ సిలబస్ పై సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసామని.. జీఓ ప్రకారమే ఫీజులు తీసుకోవాలి.. ఉల్లంఘించినట్టు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాక్టికల్స్ పాత విధానం ప్రకారమే జరుగుతాయి..ప్రాక్టీకల్స్ కి జంబ్లింగ్ లేదు.. థియరీ పరీక్షలకు జంబ్లింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు లెక్చరర్ అంశం ప్రభుత్వం దగ్గర ఉందని..ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గెస్ట్ లెక్చరర్ లను ప్రభుత్వ నిబంధనలు మేరకు తీసుకుంటామని.. సెప్టెంబర్ ఒకటి నుండే ఆన్లైన్ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. ఇప్పటికే 80 శాతం సిలబస్ పూర్తి అయిందని.. అవసరం అనుకుంటే అదనపు తరగతులు తీసుకుంటాం..రివిజన్ క్లాసెస్ కూడా తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు రెగ్యులర్ తరగతులకు హాజరు కాకున్నా పరీక్షలకు అనుమతి ఇస్తామని… హాజరు శాతం కంపల్సరీ కాదని వెల్లడించారు.

Related posts