telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంటర్ బోర్డ్ తప్పిదలపై ప్రభుత్వానికి నేడు నివేదిక!

inter board telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన గందరగోళం పై ప్రభుత్వం త్రిసభ్య కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డ్ వ్యవహారం పై వివరాలు సేకరించిన త్రిసభ్య కమిటీ శనివారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ కమిటీ ఐదు రోజులుగా విచారణ చేసింది. అయితే కమిటీ ప్రధానంగా కొన్ని అంశాలనే ప్రస్తావించి, ఇంటర్‌ బోర్డు అధికారుల తప్పిదాలను ఎత్తిచూపినట్టు సమాచారం.

అలాగే గ్లోబరీనా ఏజెన్సీ అర్హతలను తప్పుపట్టినట్టు తెలియవచ్చింది. గ్లోబరీనా ఏజెన్సీకి అర్హత లేకపోయినా.. టెండర్ తక్కువ కోడ్ చేసిన కారణంగా టెండర్ ఇచ్చనిట్లుగా కమిటీ తేల్చింది. దీనిపై ఏలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై కమిటీ నివేదికలో ప్రతిపాదించినట్లు తెలియవచ్చింది.

Related posts