telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్…

రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో 48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ఆదేశించింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో  నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని పేర్కొన్న హైకోర్టు ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి  ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హాస్పిటల్ లో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవరినైనా నియమించాలని  హైకోర్టు ఆదేశించింది. Health.telangana.gov.in  వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలన్న హైకోర్టు పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గ్యాదర్ ఐతే వారి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదని  మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది.

Related posts