telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఉస్మానియా ఆస్పత్రిలో ఆ ఏర్పాట్లు చేయండి : హై కోర్టు

high court on new building in telangana

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మానియా ఆస్పత్రిలోకి వరదనీరు వచ్చి చేరింది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో రోగులున్న వార్డుల్లోకి భారీ స్థాయిలో నీరు చేరి ఆందోళకరంగా మారిన విషయం తెలిసిందే.. అయితే, ఉస్మానియాలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదంటూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది డెక్కన్ ఆర్కియాలాజికల్, కల్చరల్ రీసెర్చ్ సొసైటీ… వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నిండుతోందని పిల్‌లో పేర్కొన్నారు. ఆ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.. ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన కోర్టు.. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని ప్రస్తావించింది.. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, తదుపరి విచారణ నవంబర్‌ 12వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. కాగా, గతంలో కురిసిన వర్షాలతో ఆస్పత్రిలోకి వార్డులోకి వర్షపునీరు చేరడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

Related posts