telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పక్క రాష్ట్రలో సెకండ్ వేవ్ తో తెలంగాణ అప్రమత్తం…

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత తగ్గుతున్న సంగతి తెలిసిందే.  కొత్త కేసులు రోజుకు 200 లోపే నమోదవుతున్నాయి.  అయితే.. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేయలేదు.  మార్చి 2 నుంచి ప్రతి రోజు కరోనా కేసుల వివరాలు ఇస్తున్న వైద్య శాఖ.. ఇకపై కేసుల వివరాలు వారానికి ఒకసారి ఇవ్వనుంది. అయితే తెలంగాణలో కోవిడ్  19 కేసుల‌పై హైకోర్టు విచార‌ణ జరిపింది. కోవిడ్ 19 కేసుల‌పై బులెటిన్ నిలిపేయ‌డంపై పిటిష‌న‌ర్ న్యాయ‌వాదులు అభ్యంత‌రం తెలిపారు. అయితే కోవిడ్ 19 బులెటిన్ ప్ర‌తిరోజు ఇవ్వాల్సిందే అని వైద్య‌, ఆరోగ్య‌శాఖ‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే కరోనా సెకండ్ వే‌వ్ మొద‌లైంది అని ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాలి అని హైకోర్టు సూచించింది. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌‌క‌లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ప‌బ్లిక్ గ్యాధ‌రింగ్స్ ‌పై ఆంక్ష‌లు విధించాలి అని అలాగే 50 ఏండ్లు పైబ‌డిన వారు వాక్సిన్ తీసుకునేలా ప్ర‌చారం చేయాలి. ఆన్‌ లైన్ ‌లో రిజిస్ట‌ర్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించాలి అని పేర్కొంది. చూడాలి మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది అనేది.

Related posts