telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హై కోర్టు సీరియస్ !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా కరోనా పరిస్థితులపై తెలంగాణ  హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ ను అమలు చేస్తుందని ఏజీ  కోర్టుకు తెలిపారు. నైట్ కర్ఫ్యూ వలన కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా ఎక్కడ తగ్గాయో చూపించాలి అని హైకోర్టు పేర్కొంది. నైట్ కర్ఫ్యూ విధిస్తే ఉదయం పబ్లిక్ ప్లేస్ లలో బార్ అండ్ రెస్టారెంట్, సినిమా థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న హైకోర్టు, కుంభమేళా కు వెళ్లి వచ్చిన వారిని ఇతర రాష్ట్రాలు  క్వారంటయిన్ లో పెడుతున్నారు ? అని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించిన హైకోర్టు, ఇంటర్ స్టేట్ బోర్డర్ వద్ద ఎలాంటి చర్యలు చేపట్టారు అని ప్రశ్నించింది హైకోర్టు. RT PCR టెస్ట్ రీపోర్ట్ ఎందుకు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. RT PCR టెస్ట్ రిపోర్ట్ vip లకు మాత్రమే 24 గంటల్లో ఇస్తున్నారు..సామాన్యులకు ఇవ్వడం.లేదని హైకోర్టు ప్రశ్నించింది. 

Related posts