telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ కేసు సీబీఐకి అప్పగిస్తే సమయం వృథా : హైకోర్టు

తెలంగాణలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. విచారణ చేపట్టిన హైకోర్టు.. సీబీఐ దర్యాప్తు అవసరంలేదని తేల్చింది.. అయితే, హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేసింది సీజే ధర్మాసనం… వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో ఈ కోర్టుకు అంతే ఉందన్న ధర్మాసనం… దర్యాప్తు ఇప్పటివరకు సరైన దిశలోనే సాగుతోందని తెలిపింది.. ఇప్పుడు సీబీఐకి అప్పగిస్టే సమయం వృథానేనని అభిప్రాయపడింది.. అయితే న్యాయవాదులు వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు ఏజీ.. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు పోలీసులు.. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించాం.. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశాం.. బిట్టు శీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో దరఖాస్తు చేశాం.. కుంట శీను, చిరంజీవిలను సాక్షులు గుర్తించే ప్రక్రియ పూర్తి చేశాం.. సిసి టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం.. నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.. ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించాం అన్నారు పోలీసులు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts