telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముగిసిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ.. పోలింగ్‌ శాతం ఎంతంటే ?

తెలంగాణ ఎమ్మెల్సీ పట్టభద్రుల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. క్యూ లైన్ల లో ఉన్న వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. ఇప్పటి వరకూ కూడా క్యూ లైన్ లలో ఓటర్లు భారీగానే ఉన్నారు. మహబూబాద్ జిల్లా లో నెల్లికుదురు వద్ద ఎమ్మెల్సీ బిజెపి అభ్యర్థి ప్రేమ్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడ్డ ప్రేమేందర్ రెడ్డి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటన మినహా అన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.
ఇక ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతాన్ని పరిశీలిద్దాం. 

Poll Percentage at the End of Poll( Approximately) :

KMM – NLG- WGL: గత ఎన్నికలలో పోలింగ్ శాతం- 54%.

క్యూ లైన్ లో ఉన్నవారందరూ ఓటేస్తే మొత్తం పోలింగ్ 55-60% మధ్య ఉండవచ్చని అంచనా.

HYD- RR- MBNGR: గత ఎన్నికలలో పోలింగ్ – 35%.

క్యూ లైన్ లో ఉన్నవారందరూ ఓటేస్తే మొత్తం పోలింగ్ 45-50% మధ్య ఉండవచ్చని అంచనా.

మొత్తం మీద గత ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల కన్నా పోలింగ్ శాతం పెరుగుతుందని అంచనా.

Related posts