telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అమీర్‌పేట మెట్రో ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్

mounika hyd metro

హైదరాబాద్ లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో మౌనిక అనే వివాహిత ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల భద్రతే మొదటి ప్రాధాన్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరో వైపు ఈ ఘటన పై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం మృతురాలి కుటుంభాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసున్నారు. మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని, దీనికి కారణమైన ఎల్ అండ్‌ టీపై మర్డర్‌ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని మెట్రో స్టేషన్‌లలో నిపుణులతో తనిఖీలు చేపట్టాలని జనసేన అధినేత కోదండరాం డిమాండ్ చేశారు.

Related posts