telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కొత్తగా మరో 159 బార్లకు ప్రభుత్వం అనుమతి…

liquor shops ap

మన తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మందు బాబులకి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 159 బార్లు ఓపెన్ చేసేందుకు కాను ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త మున్సిపాలిటీల్లో ఈ బార్ లు ఏర్పాటు చేసేందుకు సర్కారు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌‌ పరిధిలోనే 55 బార్లకు పర్మిషన్ లభించింది. ఈ రోజే నోటిఫికేషన్‌ విడుదల కాగా ఈ రోజు నుండే దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలయింది. ఫిబ్రవరి 8వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలలో ఫిబ్రవరి 10న డ్రా తీయనున్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీలో మాత్రం 11న ఎక్సైజ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు.  డ్రా పొందిన వారికి 17న క్లియరెన్స్‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌ ఇస్తారు, బార్లకు ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ను జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబ్‌‌‌‌లు ఫిక్స్ చేశారు. 50 వేల లోపు జనాభాకు రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు 42 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు 44 లక్షలు, 20 లక్షల కంటే పైన ఉంటే 40 లక్షలు ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ ఉండనుంది. బార్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌ వచ్చిన 90 రోజుల్లోపు మొత్తం ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌లోని ఫస్ట్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ చెల్లించాలి. 159 బార్లకు అప్లికేషన్ల ఫీజులతోపాటు, ఎక్సైజ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ రూపంలో 50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts