telugu navyamedia
health

ఏపీ వాళ్లకు ఇక్కడ కాన్పులు చేయం..తెలంగాణ ప్రభుత్వ వైద్యులు!

ap logo
పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురవుతున్న తెలంగాణలోని 7 మండలాలను కేంద్రం ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం అయినందున పోలవరం ముంపు గ్రామానికి చెందిన ఓ గర్భిణికి చికిత్స అందించేందుకు తెలంగాణ వైద్యులు నిరాకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తూర్పుగోదావరి చింతూరు మండలంలోని మల్లెతోట గ్రామానికి చెందిన అనూషకు నిన్న అర్ధరాత్రి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన సమీపంలోని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఊరు ఏపీలో ఉండటంతో కాన్పు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. అనూష నొప్పితో విలవిలలాడుతున్నా, చింతూరు ఏరియా ఆసుపత్రికి పోవాలని సూచించారు. దీంతో బాధితురాలిని తీసుకువెళుతుండగా, ఆసుపత్రి గేటువద్దే ఆమె పండంటి చిన్నారికి జన్మినిచ్చింది.

Related posts

రాగులలో… దాగిన రహస్యాలు…

vimala p

క్షీణించిన శివకుమార స్వామిజీ ఆరోగ్యం.. భక్తుల్లో ఆందోళన

ashok

జీర్ణ సమస్యలకు.. ఈ మూడు పండ్లు చాలు…

vimala p