telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే ?

తెలంగాణలో విద్యాసంస్థలకు పదిహేను రోజుల పాటు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా ప్రభుత్వం ఈ సెలవులను ప్రకటించింది.

ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నె 8వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చింది.తిరిగి అక్టోబరు 10 వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభమవుతాయిఈ మేరకు ప్రభుత్వం అన్నీ జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

కాగా.. దసరా పండుగ అక్టోబర్‌ 5న జరుగనుంది .తెలంగాణలో దసరా పండగను అతి పెద్ద పండగగా చేసుకుంటారు. ప్రతి ఏటా దసరా పండగకు ఎక్కువ రోజులు సెలవులను ప్రకటించడం సంప్రదాయంగా వస్తుంది.

ప్రభుత్వం పదమూడు రోజుల పాటు మాత్రమే సెలవులు ఇచ్చినా, శని, ఆదివారాలు కలిపి మొత్తం పదిహేను రోజుల పాటు విద్యాసంస్థలు తెలంగాణలో తెరుచుకోవు.

Related posts