telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దు

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా ఈ రోజు సమావేశం అయ్యారు. తొందరపడి ఓటిటికి సినిమాలు ఇవ్వవద్దని నిర్మాతలను కోరాలని ఈ సమావేశంలో తీర్మానం చేసారు. ఓటిటి వ్యవహారాలు ఇప్పుడు బాగానే వున్నా, భవిష్యత్ లో ఎలా వుంటుందో తెలియదని, థియేటర్ వ్యవస్థ పతనం అయిపోతే ఓటిటి అనేది మోనోపలీకి దారితీసే ప్రమాదం వుందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితులు చక్కబడి థియేటర్లు అన్నీ జూలై నెలాఖరుకు తెరచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందువల్ల దూరం ఆలోచించి, అక్టోబర్ నెలాఖరు వరకు నిర్మాతలు తమ తమ సినిమాలను హోల్డ్ చేసి పెట్టాలని, ఒటిటికి ఇవ్వవద్దని కోరుతూ సమావేశంలో ఓ తీర్మానం చేసారు. అప్పటికీ పరిస్థితులు చక్కబడకపోతే ఓటిటికి ఇచ్చేసుకోవచ్చు అని ఈ లోగా మాత్రం ఇవ్వవద్దని కోరుతూ తీర్మానం చేసారు. ఒకవేళ అలా ఎవరైనా అక్టోబర్ లోగా ఒటిటి కి సినిమాలు ఇస్తే, ఏ విధమైన కార్యాచరణకు దిగాలన్నది, ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలన్నది త్వరలో నిర్ణయిస్తామన్నారు.

Related posts