• Home
  • వార్తలు
  • పొత్తుల పై స్పీడ్ పెంచిన టీటీడీపీ.. కూటమి ఏర్పాటు దిశగా సంప్రదింపులు!
రాజకీయ వార్తలు వార్తలు

పొత్తుల పై స్పీడ్ పెంచిన టీటీడీపీ.. కూటమి ఏర్పాటు దిశగా సంప్రదింపులు!

Telangana Elections TTDP Leader Ramana

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పొలిట్ బ్యూరోలోని టీటీడీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో పొత్తులపై స్థానిక నేతలదే తుది నిర్ణయమని సూచించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. పొత్తుల సంప్రదింపుల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీల జాబితాను సిద్ధం చేసింది. పొత్తుపై సంప్రదింపులకు ఎల్‌.రమణ నేతృత్వంలో ఏడుగురితో కమిటీ వేశారు. దేవేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ఐదుగురితో మేనిఫెస్టో కమిటీ, గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ లో పొత్తుల పై టీటీడీ స్పీడ్ పెంచింది. తెలంగాణలో పార్టీ బాగు కోసం ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో మిగతా పార్టీలతో కూటమి కట్టేందుకు టీటీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పొత్తుల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పొత్తులపై చర్చలకు సంప్రదింపుల కమిటీ రంగంలోకి దిగింది. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం ఉత్తమ్‌తో కూడా సమావేశం కానున్నారు.

Related posts

దేవాంశ్ నన్ను మించిపోతాడు :బాబు

admin

తెలంగాణ విమోచ‌నానికి 70 ఏళ్లు…

chandra sekkhar

జర్నలిస్ట్ ల సంక్షేమమే లక్ష్యం..

admin

Leave a Comment