telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్‌.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

huge job notification in telanganaf

తెలంగాణ ఎంసెట్‌–2019 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నా యి. 3,4,6 తేదీల్లో ఇంజనీరింగ్, 8,9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు.

రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. అందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. దరఖాస్తుదారుల్లో ఈసారి ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వారిలో నలుగురు ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు హాజ రు కానుండగా, ఒకరు అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

Related posts