telugu navyamedia
culture news study news Telangana

నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల

నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు అధికారులు అన్నిఏర్పాట్లు చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీఎస్ ఎంసెట్-2019) ఫలితాలు నేటి మధ్యాహ్నం 12.00 గంటలకు విడుదల కానున్నాయి. వీటిని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిది వరకు 94 కేంద్రాల్లో ఆన్‌లైన్ ఎంసెట్-2019 పరీక్ష నిర్వహించారు. ఇందుకు ఇంజినీరింగ్ విభాగంలో 1.42 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఎంసెట్-2019 అధికారిక వెబ్‌సైట్‌తోపాటు www.ntnews.comలో కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

Related posts

హైదరాబాద్‌ నిజాం కాలేజికి న్యాక్‌ అక్రిడేషన్‌లో బి ప్లస్‌ గ్రేడ్‌

ashok

బీహార్ ని కూడా .. పలకరించిన రుతుపవనాలు…

vimala p

తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్

vimala p