telugu navyamedia
news study news Telangana

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. టాప్ ర్యాంకులు వీరికే

తెలంగాణ ఎంసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ క్యాంపస్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిది వరకు 94 కేంద్రాల్లో ఆన్‌లైన్ ఎంసెట్-2019 పరీక్ష నిర్వహించారు. ఇందుకు ఇంజినీరింగ్ విభాగంలో 1.42 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 74,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. టీఎస్‌ఎంసెట్-2019 అధికారిక వెబ్‌సైట్‌ లో డా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.

ఇంజినీరింగ్ విభాగంలో..ర్యాంకుల వివరాలు:

– రవిశ్రీతేజ 95.48 (తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి) -మొదటి ర్యాంక్
– డి.చంద్రశేఖర్ 94.65 (రంగారెడ్డి)-సెకండ్ ర్యాంక్
– ఆకాశ్ రెడ్డి (రంగారెడ్డి ) -మూడో ర్యాంక్
– కార్తీకేయ (రంగారెడ్డి)- నాలుగో ర్యాంక్
-భాను దత్తా (భీమవరం, పశ్చిమగోదావరి)-ఐదో ర్యాంక్

అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో..ర్యాంకుల వివరాలు:

– కుశ్వంత్ (భూపాలపల్లి)-మొదటి ర్యాంక్
-దాసరి అరుణ్ కుమార్ (రాజమండ్రి, తూర్పుగోదావరి) -రెండో ర్యాంక్
-అరుణ్ తేజ (కాకినాడ, తూర్పు గోదావరి) -మూడో ర్యాంక్
– సాయి స్వాతి (తిరుపతి, చిత్తూరు)-నాలుగో ర్యాంక్
– అక్షయ్ (హైదరాబాద్)-ఐదో ర్యాంక్

Related posts

మైనర్ ను కొట్టిన పోలీసులు .. ముగ్గురి పై సస్పెన్షన్ వేటు

vimala p

పారామెడికల్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోండి

vimala p

కొరకరాని కొయ్యగా.. ఉత్తర కొరియా.. మళ్ళీ అమెరికాపై నిప్పులు..

vimala p