telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కొత్తగా 1,949 కోవిడ్ కేసులు

Corona

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలను కూడా వణికిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో 51,623 మంది నమూనాలను పరీక్షించగా, 1,949 మందికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,99,276కు చేరుకుంది. శనివారం నాడు కరోనాతో 10 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,163కు చేరింది. వ్యాధి నుంచి 2,366 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,70,212కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 22,816 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంచి వైద్యుల సలహాతో చికిత్స తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. ఇక, ఇప్పటివరకూ రాష్ట్రంలో 32 లక్షలకు పైగా కరోనా టెస్ట్ లను నిర్వహించామని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Related posts