telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మాస్కుల తయారీకి మహిళా సంఘాలు!

tailoring training

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డ్‌కు తరలిస్తున్న శానిటేషన్‌ వర్కర్ల రక్షణకు జోనల్‌కమిషనర్‌ల ద్వారా మాస్క్‌లను అందించారు. అయితే వారికి ఉచితంగా రెగ్యులర్‌గా అనువుగా క్లాత్‌ మాస్క్‌లను అందించించాలని జీహెచ్‌ఎంసి నిర్ణయించింది.

అందులో భాగంగగా అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ (యూడీసీ) విభాగంలో కుట్టు శిక్షణ పొందిన 200 మంది మహిళా సంఘాలకు మాస్కుల తయారీ బాధ్యతలను అప్పగించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నలుగురు చొప్పున విడిపోయి మాస్కులుతయారుచేస్తున్నారు. ఈ నెల 8 నుంచి ఇప్పటివరకు 20 వేల మాస్కులు తయారుచేశారు. మరో రెండ్రోజుల్లో 60 వేల మాస్కుల లక్ష్యాన్ని అందుకుంటామని స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts