telugu navyamedia
news Telangana trending

కరోనా బీభత్సం.. తెలంగాణలో రెండు వేలు దాటిన కరోనా కేసులు..

Covid-19

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2055 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఏడుగురు కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 303 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704 కు చేరగా.. రికవరీ కేసులు 3,03,601 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1741 మంది మృతి చెందారు.. రికవరీ రేటు దేశంలో 95.26 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 91.7 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,362 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 8,263 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 87,332 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 1,06,59,953 కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Related posts

వైసీపీ ప్రచార సభలో కరెన్సీ నోట్లు..!

vimala p

ఇంకా ఎంత మంది నిర్భయలు బలి కావాలి ?… ప్రియాంక చోప్రా ఎమోషనల్ పోస్ట్

vimala p

గుంటూరు లో నైట్ కర్ఫ్యూ…

Vasishta Reddy