telugu navyamedia
news Telangana trending

తెలంగాణ కరోనా అప్డేట్‌.. భారీగా తగ్గిన కేసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.93 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 148 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయం లో 302 మంది కోలుకున్నారు. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,401 కు చేరుకోగా… 2,88,577 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1590 మంది కరోనాతో మృతి చెందారు. ఇక, తెలంగాణలో కరోనా మృతుల శాతం 0.54 శాతంగా ఉంటే.. దేశవ్యాప్తంగా 1.4 శాతంగా ఉందని.. రాష్ట్రంలో రికవరీ రేటు 98.35 శాతంగా ఉంటే.. భారత్‌లో 96.8 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ప్రస్తుతం రాష్ట్రంలో 3234 యాక్టివ్ కేసులు ఉండగా… వీరిలో 1,697 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక నిన్న రాష్ట్రవ్యాప్తంగా 19,821 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని అధికారులు పేర్కొన్నారు.

Related posts

ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. స్పందించిన రాహుల్

vimala p

మరోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ!

vimala p

“రంగమార్తాండ” నుంచి మరో అప్డేట్..!

Vasishta Reddy