telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఈటల

Etala Rajender

కరోనా పరీక్షలు ఇంటి వద్దే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్ లకు అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ. 2,800 చెల్లించాలని ఆదేశించింది. ఏదైనా ల్యాబ్ అంతకుమించి తీసుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.

ప్రజలు సాధ్యమైనంత వరకూ ప్రభుత్వ ల్యాబుల్లోనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా, తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అనుమతిస్తూ, అందుకు వసూలు చేయాల్సిన ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Related posts