telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రెవెన్యూ చట్టాలలో కలెక్టర్ల పాత్ర అవసరం … కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో కలెక్టర్లను పాత్రధారులను చేయడంకోసం నేడు ప్రగతిభవన్‌లో కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు మంత్రులు, సీఎస్, సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొంటారు. నయాపైసా లంచం ఇవ్వకుండా ప్రజలకు సత్వరం సేవలు అందేలా నూతన రెవెన్యూ చట్టం రూపొందాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న సీఎం కేసీఆర్.. ఈ సమావేశంలో కలెక్టర్లందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. వాటిని క్రోడీకరించి నూతన చట్టంలో పొందుపరిచే అవకాశం ఉంటుంది.

కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలు విషయంలో కూడా అభిప్రాయాలను ఈ సమావేశంలో తీసుకోనున్నారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్దేశించిన 60 రోజుల ప్రణాళికపైనా సమావేశంలో చర్చిస్తారు. కొత్త చట్టం రూపకల్పనతోపాటు, అమలులోకి వచ్చిన చట్టాల అమలు, 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలుపై జిల్లా కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశనం చేయనున్నారు.

Related posts