telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం కొత్త హైఎండ్ కార్లు..

Telangana Cm kcr New Cars

తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం కొత్త కార్లను కొనాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక 2014లో కేసీఆర్ కాన్వాయ్‌లో టయోటా ల్యాండ్ క్రూజర్, ప్రడోస్, టయోటా ఫార్చునర్స్ కార్లను కొనుగోలు చేశారు. సీఎం కాన్వాయ్ కోసం కొత్తగా హైఎండ్ కార్లను కొనాలని ఇంటలిజెన్స్ అధికారులు భావించారు. మెర్సిడెస్ బెంజ్ తోపాటు వివిధ కార్లను పరిశీలించిన అధికారులు చివరకు టయోటా వాహనాలను సీఎం కాన్వాయ్ కోసం కొనాలని నిర్ణయించారు. సీఎం కోసం ప్రడోస్ కారును ఎంపిక చేశారు.

సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంతోపాటటు గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో సీఎం కాన్వాయ్ లో ఏడు నుంచి పది కొత్త కార్లను కొనాలని నిర్ణయించారు. ప్రడో కారు ధర రూ.93 లక్షలు, ఫార్చునర్ కారు రూ.33 లక్షలుంది. కొత్త కార్లను కొన్నాక వాటిని మైన్ ప్రూఫింగ్ చేయించనున్నారు. 

Related posts