telugu navyamedia
తెలంగాణ వార్తలు

ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. సెప్టెంబ‌ర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. 2వ తేదీన ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో తెలంగాణ భ‌వ‌న్‌కు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ను సీఎం కేసీఆర్ క‌లిసి రాష్ర్టానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను వారికి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్ర‌తిపాద‌న‌ల‌కు మోడీతో పాటు కేంద్ర‌మంత్రులు సానుకూలంగా స్పందించారు. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్స‌వానికి మోడీని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.

ఇక ఢిల్లీ నుంచే రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్షించి, సీఎస్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అధికార యంత్రాంగాన్ని సీఎం అప్ర‌మ‌త్తం చేశారు. వారం రోజుల ప‌ర్య‌ట‌న అనంత‌రం సీఎం కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకున్నారు.

Related posts