telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో కొత్తగా 1006 కరోనా కేసులు

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 1006 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 613202 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు 3567 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 17,765 గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 5,91,870 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1798 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 96.27 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 87,854 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 1,75,25,639 కు చేరుకుంది.

Related posts