telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ .. బడ్జెట్..లక్షలోపు రుణాల మాఫీ, 8.58 లక్షల ఉద్యోగాలు.. హైలైట్..

CM KCR Phone opposition Leaders

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని… కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను బట్టి… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడుతుందని తెలిపారు.

బడ్జెట్ హైలైట్స్ :
ఎంబీసీ కార్పొరేషన్ కు రూ. 1,000 కోట్లు
షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ. 9,827 కోట్లు
షెడ్యూల్ కులాల ప్రగతి నిధికి రూ. 16,581 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు
డిసెంబర్ 11, 2018లోపు తీసుకున్న లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీ
పంచాయతీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుంచి రూ. 3,256 కోట్లు
ఒక్కో మనిషికి రూ. 1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు
500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు
టీఎస్ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు
పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి
ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయి

Related posts