telugu navyamedia
news political Telangana trending VOTE

తెలంగాణాలో ముసిగిన పోలింగ్… క్యూ లో ఉన్నవారికి అవకాశం…

telangana assembly poling in done

తెలంగాణాలో నేడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు జరిగింది. 5 గంటల అనంతరం కూడా క్యూ లో ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలైన 13 నియోజక వర్గాలలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి 68.5 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి కాసేపటిలో అవి విడుదల కానున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ లో భాగంగానే లగడపాటి ముందుగా చెప్పినట్టుగా 7 గంటలకు తన సర్వే నివేదికను వెల్లడించనున్నారు. పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. అయితే అసలు ఫలితాలు 11న విడుదల కానున్నాయి. అదే రోజున దేశంలో నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Related posts

ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది: కృష్ణయ్య

vimala p

మోడీ ప్రభుత్వం ప్రజల ఖాతాలలో నగదు జమచేస్తుందట.. బ్యాంకుల వద్ద బార్లు తీరిన జనం.. !!

ashok

జర్నలిస్ట్‌ కేసులో డేరా బాబా దోషి.. ఈ నెల 17న శిక్ష ఖరారు!

vimala p