telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

అకడమిక్‌ క్యాలెండర్ రిలీజ్..

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ (2021-22) విడుదల అయ్యింది. ఈ నెల 1వ తేదీ నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభ‌మైన నేప‌థ్యంలో రాష్ట్ర విద్యా శాఖ అకాడ‌మిక్ క్యాలెండ‌ర్‌ను శ‌నివారం విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ ఈ క్యాలెండర్ రిలీజ్ చేశారు.

మొత్తం 213 రోజులు ప‌ని దినాలు ఉండ‌గా, ఇందులో 166 రోజుల పాటు ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు జ‌ర‌గ‌నున్నాయి. మిగ‌తా 47 రోజుల్లో వ‌ర్చువ‌ల్ మెథ‌డ్‌లో త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు 2022, జ‌న‌వ‌రి 10వ తేదీ నాటికి సిల‌బ‌స్ పూర్తి చేయాల‌ని అధికారులు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో టెన్త్ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించారు. పాఠ‌శాల‌ల చివ‌రి వ‌ర్కింగ్ డే ఏప్రిల్ 23. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వ‌ర‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించారు.

ద‌స‌రా సెల‌వులు : 06.10.2021 to 17.10.2021 (12 రోజులు )
క్రిస్మ‌స్ సెల‌వులు : 22.12.2021 to 28.12.2021 (7 రోజులు )
సంక్రాంతి సెల‌వులు : 11.01.2022 to 16.01.2022 (6 రోజులు )
వేస‌వి సెల‌వులు : 24.04.2022 to 12.06.2022

Related posts