telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ వచ్చిన తరువాత నాలుగు మెడికల్ కాలేజీలు: మంత్రి ఈటెల

Etala Rajender

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత నాలుగు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసనసభలో ఆరోగ్యశాఖకు సంబంధించిన విషయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ గతంలో జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూలు, డయాలసిస్‌లు లేవన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత డయాలసిస్ సెంటర్లతో పాటు ట్రామా కేర్, ఐసీయూ సెంటర్లను భారీగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

కేసీఆర్ కిట్లు వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతంగా ఉన్న ప్రసవాలు 65 శాతానికి పెరిగాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన తెలంగాణే లక్ష్యంగా 12,289 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారన్నారు. 2272 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాట్లు చేసిందిని తెలిపారు. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాల తీవ్రత ఉందని, డాక్టర్లు తమ సెలవులు రద్దు చేసుకొని, సాయంత్రం కూడా ఓపీ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

Related posts