telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ బడ్జెట్ 2019 వివరాలు!

Un-employee allowance shortly telangana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గిందన్నారు. వాహనాల అమ్మకాలు 10.65 శాతం తగ్గాయన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, మాంద్యం ప్రభావం రాష్ట్రంపై నామమాత్రమేనని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు:
2019-20 ఏడాది ప్రతిపాదిత వ్యయం రూ.1,46,492 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,11, 055 కోట్లు
మూలధన వ్యయం రూ. 17,274 కోట్లు
మిగులు బడ్జెట్‌ అంచనా రూ.2,044 కోట్లు
ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు
ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.1,82,017 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.9,402 కోట్లు
గ్రామపంచాయతీలకు రూ.2,714 కోట్లు
మునిసిపాలిటీలకు రూ. 1,764 కోట్లు
రైతు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు
రైతుబంధుకు రూ.12 వేల కోట్లు
రైతు బీమా కోసం రూ.1125 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.1,336 కోట్లు
ఉచిత విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 8 వేల కోట్లు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ. 31,802 కోట్లు.
రూ.1,03,551 కోట్ల రూపాయల మూలధన వ్యయం పెరిగింది
2019-20 ఆర్ధిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం రూ. 1,46,492.30 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,11,055.84 కోట్లు కాగా.. మూలధన వ్యయం 17,274,67  కోట్లు
మిగులు రూ. 2,044.08 కోట్లు కాగా.. ఆర్ధిక లోటు 24,081.74 కోట్లు

మిషన్ భగీరథతో నీటి సమస్య పరిష్కారం
కొత్త మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలతో మరింత పారదర్శక పాలన
మాంద్యం కారణంగా ఆదాయం తగ్గినా పరిస్థితి మెరుగుపడుతుంది
ఆదాయ వనరులను బట్టి ప్రాధాన్యతలను మారుస్తాం
మాంద్యం ఉన్నా వ్యవసాయం, సంక్షేమ రంగానికి అత్యధిక నిధులు
18 నెలలుగా ఆర్ధిక మాంద్యం కొనసాగుతోంది
రైతు బంధు పథకం నిరంతరాయంగా కొనసాగుతుంది
కాళేశ్వరం సహా భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు కొనసాగింపు
స్థానిక సంస్థలకు నిధుల కొరత లేకుండా చర్యలు

Related posts