telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ‌లో 10వ‌త‌ర‌గ‌తి పరీక్షలు ప్రారంభం..

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ క్లాస్ పరీక్షలు నేటి నుంచే  ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు జరగని పదో తరగతి పరీక్షల కోసం 2,861 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు రాస్తున్నారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభం అయ్యాక 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని, ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు అని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.

మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచనల మేరకు ప్రతి పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష సిబ్బందికి కేంద్రాల్లో ఫోన్లు, స్మార్ట్ వాచీలకు అనుమతి లేదని అధికారులు పేర్కొన్నారు.

కాగా కొవిడ్ ప్రభావం వల్ల ఈసారి 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. గతంలో ఉన్న 11 పేపర్లను 6 పేపర్లుకి కుదించడంతో పాటు ప్రశ్నల్లో ఛాయిస్ పెంచారు .

Related posts