telugu navyamedia
news study news Telangana

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు మరోసారి పెంపు

inter board telangana

తెలంగాణ ఇంటర్ బోర్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడిగించింది. సోమవారంతో ముగిసిన గడువును మే 2వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఫీజు చెల్లించని విద్యార్థులు 2వ తేదీలోపు చెల్లించాలని సూచించింది. సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులు కచ్చితంగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారి సబ్జెక్టుల జవాబు పత్రాలను ప్రభుత్వం ఉచితంగా రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ చేస్తోంది. అప్పుడు కూడా ఫెయిలైనట్లు తేలితే తప్పనిసరిగా సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థి పరీక్ష ఫీజు చెల్లించని పక్షంలో సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించరు.

Related posts

చంద్రబాబు ఇంకా తానే సీఎం అనే అపోహలో ఉన్నారు: హోం మంత్రి సుచరిత

vimala p

నిరాడంబరంగా కుమారస్వామి కుమారుడి పెళ్లి !

vimala p

వాహన ప్రమాద నివేదికలు : .. హెల్మెట్ లేకపోవటం వల్లనే.. 43వేల మృతులు..

vimala p