telugu navyamedia
telugu cinema news

“ఎన్టీఆర్ బయోపిక్”పై తేజ కామెంట్స్

ntr biopic

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకులను పలకరిస్తుందన్న విషయం తెలిసిందే. మొదటి భాగమైన “ఎన్టీఆర్ : కథానాయకుడు” చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్నినికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో సినిమా రెండవ భాగమైన “ఎన్టీఆర్ : మహానాయకుడు” చిత్రంపై దృష్టి పెట్టాడు దర్శకుడు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ కు ముందుగా తేజ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వలన ఈ బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ బయోపిక్ గురించి స్పందించాల్సిందిగా అడగ్గా… “ప్రస్తుతం నా సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. నాకు ఎన్టీఆర్‌ బయోపిక్‌ చూసేంత సమయం లేదు. అందుకే నేను స్పందించలేకపోతున్నాను. సినిమా చూసుంటే ఖచ్చితంగా మాట్లాడేవాడిని… అని సమాధానం చెప్పారు తేజ. సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్న ఎదురవగా… “అది దర్శకుడిపై ఆధారపడి ఉంటుంది…” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న “సీత” చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. 

Related posts

ఏప్రిల్ 18 న…రాఘ‌వ లారెన్స్  “కాంచ‌న‌-3” ..

vimala p

యండమూరి “దుప్పట్లో మిన్నాగు” టీజర్ విడుదల

ashok

చిరంజీవిపై కేసు కొట్టివేత… హైకోర్టులో ఊరట

vimala p