Trending Today క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

ప్రాణం తీసిన…మైనర్ ప్రేమ…

SUICIDE

అనుబంధాలకు, ఆప్యాయతలకు సుదూరంగా పెరుగుతున్న నేటి యువతకు ఏది ప్రేమ, ఏది ఆకర్షణ అనేదానిపై కనీస అవగాహన లేకపోవటంతో టీనేజ్ వయసులో పట్టించుకునే వారు లేకపోవటంతో ఎవరైనా కాస్త మనసుకు నచ్చినట్టు మాట్లాడగానే దాన్నే ప్రేమ అనుకోని వారికోసం ఎంత దూరం అయినా వెళ్తున్నారు, ఏమైనా చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయనడానికి మళ్ళీ పెద్దగా సాక్ష్యాలు అవసరం లేదు, రోజు మనమే ఎక్కడో అక్కడ చదువుతూనే ఉన్నాము.

తాజాగా ఇలాంటిదే ఒక సంఘటన విషాదాన్ని మిగిల్చింది. ఇద్దరు మైనర్ లు. అబ్బాయి 17, అమ్మాయి 15ఏళ్ళ వయసు వారు. భద్రాద్రికి చెందిన వీరు బాపూజీ నగర్ లో నివాసం ఉంటున్న పదో తరగతి చదువుతున్న బాలికకు, కే.టి.పి.ఎస్ కాలనీలో డిప్లొమా చదువుతున్న బాలుడితో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా అనుకోని.. పెద్దలు ఒప్పుకోరు అనుకున్నారో.. పెద్దలకు తెలిసి కోప్పడ్డారో తెలియదు గాని…నిర్మాణంలో ఉన్న భవనం నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అది గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా వారిని ఆసుపత్రికి తరలించే మార్గమధ్యంలో బాలుడు మరణించగా, బాలిక కొనఊపిరితో ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఖమ్మం తరలించారు. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు విచారణ చేపడుతున్నారు.

Related posts

ప్రమాదానికి కొన్ని గంటల ముందు… స్నేహితులతో ముచ్చటించిన హరికృష్ణ

jithu j

మీట్ అండ్ గ్రీట్ ‘చంద్రబాబు’ అంటున్న … నాట్స్

chandra sekkhar

ఓవైపు సక్సెస్ మరోవైపు విషాదం… సతమతంలో అల్లు ఫ్యామిలీ

nagaraj chanti

Leave a Comment